Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డినగర్ డివిజన్‌కు చెందిన మానస టూల్‌టెక్ అధినేత, ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ అధ్యక్షులు, అభినవ కవి, జాతీయ అవార్డు గ్రహిత వాకిటి రామ్‌రెడ్డి జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. జూన్ 5న నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనకు అవార్డును అందజేస్తారని పుడమి జాతీయ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, దశరథి అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచారి, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ అధ్యక్షులు గంట జలంధర్‌రెడ్డి, జిరాసం అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య, ఆత్మీయ భారతీ సాహిత్య సేవ సంస్థ కార్యవర్గం, కవులు, కళాకారులు, బంధువులు రామిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.