Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్
- న్యూజెర్సీలో ఉస్మానియా పూర్వ విద్యార్థులతో సమావేశం
నవతెలంగాణ-ఓయూ
విద్యాబుద్దులు నేర్పి ప్రపంచ యవనికపై మనకో ప్రత్యేక గుర్తింపు, స్థాయిని అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివద్ధిలో భాగస్వామ్యం కావాలని ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ పూర్వవిద్యార్థులకు పిలుపునిచ్చారు. మన ఊరు-మన బడి స్ఫూర్తితో విదేశాల్లో స్థిరపడి పారిశ్రామికవేత్తలుగా వివిధ వత్తుల్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరూ మన యూనివర్శిటీ-మన ఉస్మానియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం మేరకు మంగళవారం న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏడాది కాలంగా ఓయూలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. 21 అంశాలతో ప్రత్యేకంగా ఎజెండాను రూపొందించుకుని మౌలిక వసతుల కల్పన, పరిశోధన, పరిపాలనా రంగాల్లో చేపడుతున్న సంస్కరణలను వారి ముందుంచారు. ఇప్పటివరకు పూర్వ విద్యార్థులను యూనివర్శిటీ అభివద్ధిలో పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయామని, ఇకపై అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కషి చేస్తున్నామని, దీనిలో భాగంగా ఉస్మానియా అల్యూమినై సెల్, అల్యూమినై ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఫౌండర్ చైర్మెన్ పైళ్ల మల్లారెడ్డి డి.రవీందర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టాటా అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి, వంశీరెడ్డి, పారిశ్రామికవేత్తలు సుధాకర్ వడియాల, మేడి హరినాథ్, రవి ప్రకాశ్, వెంటక్ మారోజు, దొంతి నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు.