Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని షాదాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ తెలిపారు. నాణ్యత గల వైద్య, ఆరోగ్య సేవలను అందించేందుకు షాదాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంంం సమయం ముగిసినప్పటికీ వస్తున్న రోగులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామనిి తెలిపారు. హిమాయత్ సాగర్ రోడ్డులోగల షాదాన్ హాస్పిటల్లో ఈ నెల 23న ప్రారంభమైన మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందనీ, మరింత మందికి ఆరోగ్య సేవలను అందించేందుకు ఈ క్యాంపును కొనసాగిస్తు న్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాల వారికీ ఈ క్యాంపులో వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. విజారత్ రసూల్ ఖాన్ సొసైటీ సెక్రెటరి షాదాన్, సొసైటీ వైస్ ఛైర్మెన్ ఏజాజుర్రహ్మాన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిం చారు. ఇప్పటి వరకూ 20వేలకు పైగానే రోగులకు వైద్య సేవలందించామన్నారు. 5-7వేల మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చేరి వైద్యచికిత్సలు పొందు తున్నారన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు సైతం ఉచితంగా అందించడం ఈ మెగా హెల్త్ క్యాంపు ప్రత్యేకత. చెవి, ముక్కు, గొంత, కంటి, గుండె, ఆర్ధో పెడిక్, మూత్రపిండాల, గ్యాస్ట్రో, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ తదితర ఉచిత సేవలు అందిస్తు న్నారు. 500కు పైగా ఆపరేషన్లు నిర్వహించామనీ, మోకాలి రీప్లేస్ మెంట్, కంటి ఆపరేషన్లు, ఎముకల సర్జరీ, స్త్రీల సమస్యలు, ప్రసవాలు, సిజీరియన్లు అన్నీ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఎమ్మారై, సీటీ స్కాన్, ఈసీజీ, అల్ట్రా సౌండ్ పరీక్షల్ను, బ్లండ్ బ్యాంక్, ఆంబులెన్స్ సౌకర్యమూ ఉంది. ఉచితంగా మందులూ అందిస్తున్నామని వివరించారు. రోగుల కోసం ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని సారిబ్ రసూల్ ఖాన్ చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యమూ కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9000988544, 9676311747, 8686285796, 9849019535,9885751975, 9985230806, 9966112448, 630465569, 986606046 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.