Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
- ఈ నెల 5వ వరకు నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్
ఐఐఐడీ-హైదరాబాద్ ప్రాంతీయ విభాగం, ప్రతిష్టాత్మకంగా ''ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022'' నాలుగో ఎడిషన్‌ను ఈ నెల 3-5వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరై ఈ ఎగ్జిబిషన్‌ను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022లో ప్రతి స్టాల్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నదన్నా రు. మన నివాస స్థలాలను మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా మార్చడానికి ఇంటీరియర్ డిజైనింగ్ రంగలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతుహలాన్ని మరింత పెంచిందనీ, ఇది గొప్ప అధ్యయన అనుభవమన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండైనా తెలంగాణకు వచ్చిన సందర్శ కులకు స్థానిక కళాకృతులను అందించడం ద్వారా వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చన్నారు. ఇక్కడ అన్ని రకాల ఫర్నీచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఉపయోగించడం చాలా వినూత్నమైనది అన్నారు. అనేక మంది ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లు, సాధారణ ప్రజలు దీనిపై అపారమైన ఆసక్తిని కనబరుస్తున్నందున ఈ ఎక్స్పో భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పారు. ఐఐఐడీ హెచ్ఆర్పీ చైర్పర్సన్, ఆర్కిటెక్ట్ మనోజ్ వాహి మాట్లాడుతూ బాధ కలిగించిన కరోనా చీకటి కోణం మన వెనుక ఉన్నప్పటికీ, ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. డిజైనర్ల సమాజం, పరిశ్రమ, అంతిమ వినియోగదా రుల నుంచి నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఐఐఐడీ ఈ వేదికను అర్ధవంతమైన ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రదర్శన ఐఐఐడీ హైదరాబాద్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ పరిష్కారాల కోసం సరికొత్త ట్రెండ్లను, ప్రాడక్ట్‌లను పరిచయం చేయడం ద్వారా బలమైన మార్పుకు ఉత్ప్రేరకంగా పని చేసి వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని తెలిపారు. ఐఐడీ-హెచ్ఆర్సీ గౌరవ కోశాధికారి, ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022, కన్వీనర్, ఎఆర్. రాకేష్ వాసు మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇతివృత్తం నేపథ్యంతో రూపొందించబడిరదన్నారు. ఐఐ ఐడీ ఎల్లప్పుడూ అర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పరిశ్రమను ప్రోత్స హిస్తుందన్నారు. చేర్యాల్, పెంబర్త్ నుంచి కళాకారులను తీసుకొచ్చామనీ, విద్యార్థులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌ల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లలో పోచంపల్లి నుంచి నేత కార్మికులు, అనంతపురం నుంచి లెదర్ తోలు బొమ్మలాట చేస్తున్నారు. ఐఐఐడీ వెదురుపై కూడా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోందని తెలిపారు. ఏఆర్. జబీన్ జకారియాస్, జాతీయ అధ్యక్షుడు, ఐఐఐడి మాట్లాడుతూ ఐఐఐడీలో తాము చేయాలనుకుంటున్న అన్ని పనులను మీరు కనుక పరిశీలిస్తే, అవన్నీ అనేక ప్రాజెక్ట్‌లు, ప్రోగ్రామ్‌లుగా కనిపిస్తాయన్నారు. ఇంటీరి యర్ డిజైన్ నిపుణుల నాణ్యతను మెరుగుపరచడం దేశం, మన చుట్టూ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. కాబట్టి ఇది జరగాలంటే, కలలు కనే డిజైనర్లు, మన కలలకు రెక్కలు ఇచ్చే వర్తకం, తుది వినియోగదారులకు చేర్చడం అనే మూడు విభిన్న అంశాలను ఒకేచోట చేర్చడం అనేది ప్రాథమిక సూత్రం అన్నారు. ఏఆర్.ప్రవీణ్ కుమార్, గౌరవ కార్యదర్శి, ఐఐఐడీ-హైదరాబాద్ చాప్ఠర్ మాట్లాడుతూ, ఐఐఐడీ 25 ఏండ్ల ప్రొఫెషనల్ బాడీ, ఇది ఇన్సైడర్ ఇన్సైడర్ ఎక్స్ 2022 యొక్క 4వ ఎడిషన్ అన్నారు. 120 ఎగ్జిబిటర్లు, 50 కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొ ంటున్న ఈ ఎగ్జిబిషన్ రెండు హాళ్లలో ఇంటీరియర్ల కోసం అత్యుత్తమ, సరికొత్త ట్రెండ్లను ఒకే వేదికను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. డిజైన్‌ను కమ్యూనిటీకి తమ కళారూపాలను కూడా భాగం చేయడానికి చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారు లు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే అతి పెద్ద ప్రదర్శన కాగా, ఈ మూడు రోజుల్లో డిజైన్‌కు సంబంధిత రంగాలకు చెందిన 4000 మందికి పైగా సందర్శకులు రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు.