Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అషాడ మాసంలో జరగబోయే బోనాల పండుగ నిర్వహణ, ఏర్పాటుపై సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మెన్ రాకేష్ తివారి తెలిపారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్.అర్.డి సంస్థలోనీ ఎస్.కే హల్లో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో ఈ సమీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొననున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆలయాలకు సంబంధించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రతినిదులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్ కోరారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద జరగాల్సిన అభివృధి పనులపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.