Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ సంగీత యాదవ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
పట్టణ ప్రగతి ప్రధాన లక్ష్యం ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని సోమాజిగూడ కార్పొరేటర్ వన్ సంగీత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పట్టణ ప్రగతిలో భాగస్వాములైన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ డివిజన్ పరిధిలోని బీఎస్ మక్క కుందన్‌బాగ్ హరిగేట్ సోమాజి గూడ డివిజన్ల పరిధిలో పర్యటించిన వారు గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక నివాసాలు నీటిలోని ఉండిపోవడం వలన కొందరు నివాసాలు వదిలి వెళ్లాలని, మరోమారు అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకొని మురికి నీటి ఎద్దడి నుండి తమను కాపాడాలని కమిషనర్ ముందు స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నారు. ఈ సమస్య గురించి గత సంవత్సర కాలం నుండి ప్రజలు తెలియజేస్తూనే ఉన్నారని ముఖ్యంగా మురుగు నీటి సమస్యలు వ్యర్థాల తొలగింపు అలసత్వం ప్రధాన కారణాలని కార్పొరేటర్ కమిషన్ దష్టికి తీసుకువచ్చారు. సమస్యలను దశలవారీగా తీరుస్తామని దీనిపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని జోనల్ కమిషనర్ రవికిరణ్ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. కమిషనర్ ఇచ్చిన హామీతో ప్రజలు స్థానిక కార్పొరేటర్లకు కమిషనర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు తమ సమస్య లను మీరు వస్తే చాలని తెలిపారు. స్వయంగా వ్యర్థాలను కార్పొరేటర్ ట్రాక్టర్‌ను వేసుకొని ప్రజలు జీహెచ్ఎంసీ కార్మికులు సహకరించాలని, ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ పారవేయడం, అవగాహన లేనివారికి ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని నాయకులు జీహెచ్ ఎంసీి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.