Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
- సీఐటీియూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం పరిధిలోని మోర్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సీిఐటీియు మద్దతు తెలుపుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు. 1వ తేదీ రాత్రి నుంచి శనివారం వరకు రాత్రి, పగలు అనకుండ కంపెనీ ముందే నిద్రలు చేస్తూ పోరాడుతున్న కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులు కోరే కోరికలు చాలా న్యాయమైన అని వాటిని తీర్చాలని డిమాండ్ చేశారు. ఒకటవ తేదీన మోర్ ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న 82 మంది కార్మికులకు అక్రమంగా విధులు నిలిపి వేయడాన్ని సీిఐటీియు జిల్లా ఉపాధ్యక్షులు కిసరి నర్సిరెడ్డి ఖండించారు. తక్షణమే మోర్ ప్యాకింగ్ సెక్షన్ని ఓపెన్ చేసి అందులో పనిచేయుచున్న కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేస్తుంది. అందులో పనిచేస్తున్న కార్మికులు గత 20ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని, వారిని తొలగించడం దారుణమన్నారు. వెంటనే మోర్ యాజమాన్యం కార్మికులకు న్యాయం చేయాలని, ఒకవేళ మూసివేస్తే కార్మికులందరికీ మూడు నెలల నోటీస్ పిరియడ్ వేతనం, వాళ్ల సర్వీసును బట్టి గ్రాడ్యూటీ సంవత్సరానికి నెలరోజుల వేతనం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేస్తున్నాం అన్నారు. గత 20 ఏళ్ల నుండి కంపెనీని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికుల న్యాయం జరపాలని ప్రజలు ప్రజాతంత్రవాదులు కార్మికులకు సంఘీభావం తెలిపి వారి పోరాటానికి మద్దతు తెలపాలని సీిఐటీియు విజ్ఞప్తి చేస్తుంది. తక్షణం అందులో చాలా మంది కార్మికులకు పీఎఫ్ బకాయిలను క్లియర్ చేయాలని సీిఐటీియు డిమాండ్ చేస్తుంది. అక్రమ చర్యలకు పాల్పడిన మోర్ యాజమాన్యం యొక్క లైసెన్స్ రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని సీిఐటీియుడిమాండ్ చేస్తుంది. మాధవరావు లక్ష్మయ్య కష్ణయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.