Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా నిలుస్తుందని కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ అన్నారు. శనివారంనాడు బోడుప్పల్ కార్పొరేషన్ జ్యోతి నగర్లో నివాసం ఉంటున్న కిండన్నకు,హేమనగర్కు చెందిన చంద్రశేఖర్లు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఇద్దరికీ రూ.60 వేల చొప్పున వచ్చిన చెక్కులను అందచే శారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.