Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్ రెస్టారెంట్ వారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్ ఫెసివల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ వంటల రుచులు ప్రతిరోజూ భోజన వేళలలో 12.30 గంటల నుంచి 3.00 గంటల వరకూ రాత్రి డిన్నర్ సమయంలో 7.30 గంటల నుంచి 10.00 గంటల వరకూ నిర్వహించే ఈ ఫుడ్ ఫెస్టివల్లో అందించే రుచులు భోజన ప్రియులను అలరించనున్నా యి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన వంటకాలతో తయారు చేసిన మెనూ ప్రకారం ఇవ్వను న్నారు. హౌటల్‌కు చెందిన మాస్టర్ ఛెఫ్ వెంకటేష్ చిన్న నాటి నుంచి తాను స్వయంగా రుచి చూసి ఆస్వాదించిన రుచులతో ఏరి కోరి ఎంపిక చేసిన తెలంగాణ సాంప్రదా య వంటకాలను మెనూలో చేర్చి అందిస్తున్నారు. వారం రోజుల పాటూ సాగే ఈ రుచుల పర్యటనలో నాన్ వెజిట ేరియన్స కోసం నాటు కోడి కూర, తుంటి కూర బోటి, తలకాయ కూర, యాట కూరల వంటి వాటిని పలావ్‌తో కలిపి వడ్డిస్తారు. వెజిటేరియన్ల కోసం బచ్చల కూర, వంకాయ పులుసు, పుంటికూర చన్నాదాల్, పప్పు చారు పచ్చి పులుసు వంటి వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. జవర్ రోటి వంటి స్థానిక వెరయిటీలు మెనూలో భాగంగా ఉంటాయి. ఇలా పలు వంటకాలతో సాగే ఈ ప్రయాణంలో చివరగా పాశం, గరిజెలు, రవ్వ లడ్డు, బక్షాలు, గవాలు, చక్కెర పొంగల్ వంటి డెజర్ట్స్‌తో పాటూ పలు రకాల కకులు, పేస్ట్రాలు కూడా ఉంటాయి. ప్రాంతీయ వంటకాలను వేడి వేడిగా వడ్డించడానికి ప్రత్యేకమైన లైవ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటూ తాజా పండ్లు కూడా మెనూలో భాగంగా చేర్చారు. ఈ సందర్భంగా హౌటల్ ఆదిత్య పార్క్ మేనేజర్ రాజా మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా ఆదిత్య పార్క్ వారు ఎంతో ప్రత్యేకత గల వంటకాలను అందిస్తామనే వాగ్దానాన్ని నిలబెట్టుకొంటున్నట్టు తెలి పారు. కేవలం రూ.699 ధరతో (ట్యాక్స్‌లు అదనం) అందించబడే ఈ ప్రత్యేకమైన బఫెట్ సందర్భంగా రెస్టారె ంట్‌ను ఉత్సాహవంతమైన తెలంగాణ ప్రాంతపు వాతావ రణాన్ని గుర్తుకు తెచ్చేలా అలంకరించినట్టు తెలిపారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్‌ను నిర్వహించడం ద్వారా తమ వద్దకు వచ్చే గెస్ట్‌లకు నిత్య నూతన రుచులను అందంచాలనే ఆదిత్య పార్క్ లక్ష్యాన్ని సాధించడమనేనని వివరించారు.