Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్కాజిగిరి:రెయిన్ వాటర్ కోసం పైపు లైను వేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. మా పాఠశాల మన ఊరు-మన బస్తీకి ఎంపికైంది. అందుకు సంబంధించిన ఏఈ శ్రీనివాస్ని శుక్రవారం అక్కడ తీసుకువచ్చి వారి సలహా తీసుకున్నాం. రోడ్డు మీదకు వేయండి అంటే డ్రjయినేజీ వాటర్ ఎదురు అవుతుందని చెప్పారు. వారిని స్కూల్ లోపల నుంచి వేయొద్దని చెప్పాం. రెయిన్ వాటర్ అని ఇప్పుడు వేసినా భవిష్యత్తులో డ్రయినేజీ కూడా దీనికి కలిపే అవకాశం ఉంది. పిల్లలు ఇటు వైపు అన్నం తింటారు. కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యూహాలతో గతంలో ఉన్న పైపు లైను వైపు వేసుకోవచ్చని అనుకున్నాం. కానీ ఏఈ శ్రీనివాస్, డీఈఓకి రిపోర్ట్ పంపిన తర్వాత డీఈఓ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. మేం వారికి పైపు లైను వేయడానికి ఇంకా అనుమతులు ఇవ్వలేదు. శశిధర్, ఎంఈఓ, మల్కాజిగిరి.