Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జై భీమ్ నగర్ సర్వేనెంబర్ 346లో కూలినాలి చేసుకుంటూ నివసించే నిరుపేదల గుడిసెలను, ఇండ్లను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేయించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేయడం పట్ల కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు నాగనిగళ్ల బాలపీరు పలువురు నాయకు లతో కలిసి కూల్చివేసిన ఇండ్లను సందర్శించా రు. పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిజాం పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చెరువులు, కుంటలు, ఎకరాల కొద్దీ భూముల కబ్జాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నా నోరు మెదపని అధికారులు పేదలు నివసించే ఇండ్లను నేలమట్టం చేయడం అన్యాయం అన్నారు. పేదల గుడిసెలపైనేనా అధికారుల ప్రతాపం? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పట్ల ఒకలా, పెద్దల పట్ల మరోలా వ్యవహరిస్తోందన్నారు.