Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్న ముఠాను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ వివరాల ప్రకారం ఆన్లైన్ గేమ్ ఆడుతున్న ట్టు సమాచారం అందుకున్న పోలీ సులు పంజాగుట్ట ఏసీపీ పి.వి. గణేష్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు ఆదేశాల మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ గౌడ్, గిరిధర్ తన టీంతో నిఘా పెట్టి విశాల్ పటేల్, కమలేశ్ రావత్‌నే ఎస్ఆర్ నగర్‌లోని బి.కె గూడా పార్క్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారంతో పటేల్ హితీశ్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.కోటీ 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన ధర్మేష్ బారు పరారీలో ఉన్నాడు. వీరు నలుగురూ గౌలిగూడలో నివాసం ఏర్పాటు చేసుకుని కొరియర్ బార్సుగా పనిచేస్తూ ''బెట్ బారు 9.కామ్'' ద్వారా రూ.50 వేలకు తగ్గకుండా బెట్టింగ్ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఓడిన వారు వెంటనే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా, నగదు రూపంలో నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.కోటీ 15 లక్షల నగదు, ఒక కౌంటింగ్ మిషన్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సార్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ మీడియాకు తెలిపారు.