Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలోని మహిళలకు సమానత్వం, హింసలేని జీవితం కోసం ఉద్యమాలు నిర్మించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు ఎల్.ఎస్. రాజేశ్వరి పిలుపునిచ్చారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శని వారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన ్లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్.ఎస్.రాజేశ్వరితో పాటు మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు జోషిబట్ల కల్పన, కందిమళ్ల సావిత్రి, డాక్టర్ బి.వి.విజయలక్ష్మిలను శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా సమితి సన్మానించింది. అనంతరం ఎల్.ఎస్.రాజేశ్వరి మాట్లాడుతూ కేంద్రంలో అధికార బీజేపీ పాలనలో మహిళల హక్కులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయన్నారు. గడిచిన ఎనిమిదేండ్ల వెడీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. ఇలాంటి అనేక కేసుల్లో ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ నేతలే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంఫ్‌ు పరివార్ శక్తులు, సాంస్కతిక జాతీయవాదం పేరుతో ఏ దుస్తులు ధరించాలి, ఏ ఆహారం తినాలి అని యువతులకు హింస, వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై హింస అత్యంత విస్తతమైన మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటి అని తెలిపారు. ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడు తోందన్నారు. మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద, కుటిల కార్పొరేట్ విధానాల వల్ల దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం, మాంద్యంలోకి నెట్టబడిందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగావకాశాలు లేకుండా చేయడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం, నల్ల చట్టాలు రైతులు, కార్మికుల పై రుద్దడం, మహిళలు, దళితులపై దాడులకు ప్రోత్సహిం చడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజ్యాంగం, ప్రజా స్వామ్యం, లౌకికవాదం, మహిళల హక్కుల రక్షణ, హింస కు వ్యతిరేకంగా మహిళలను సమీకరించలన్నారు. హక్కు లు, సాధికారత కోసం మహిళల పోరాటాలను ప్రజాస్వా మ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లడమే మహిళా సమాఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. సమాజంలో తమ సముచిత స్థానం కోసం మహిళలు తమ స్వరాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరమ్ కన్వీనర్ పి.ప్రేమ్ పావని, భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.రజిని, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి యు.సజన, నేదునూరి జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఎస్.ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమారి, షహనా అంజుమ్, రాష్ట్ర నాయకులు పడాల నళిని, కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.