Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భూపతి అన్నారు. భూపతి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ దేవి అధ్యక్షతన పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ సేవా సదన్ భవనంలో శిక్షణా తరగ తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సైన్యం లాంటివారని కొని యాడారు. ప్రజలతో ఎలా మెలగాలో వాళ్లకు కావాల్సిన సూచనలను వివరించారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తులు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి తమ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలనీ, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని కోరారు. రాబోయే తరాలకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలంటే మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.