Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ ఓయూ కమిటీ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్
మే 28న జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రామ్ నగర్ చౌరస్తాలో పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నాయకులు వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై జరిగిన కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని అలసత్వం తీవ్రంగా ఖండించారు. బాలిక తండ్రి కేసు పెట్టినప్పటినుంచి పోలీసులు ఆలస్యంగా స్పందించటం, విచారణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నా రు. ఈఘటనను ఆధారం చేసుకుని స్త్రీ, పురుష సమానత్వాన్ని అంగీకరించని బీజేపీ మతోన్మాద చర్యలను తిప్పి కొట్టాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే హింస ను రాజకీయాల కోసం వాడుకుంటే ప్రజలు తిరస్కరిం చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, స్త్రీలపై హింసను నివారించడంలో విఫలం అయిందని, నగర ంలో పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కతితో పబ్బు, క్లబ్బులు నిషేధించాలి అన్నారు. మహిళలు బాలికలపై హింసను ప్రేరేపించే విధంగా ఉన్న సినిమాలను నిషేధించాలి అన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ నాయకులు దేవ మణి, శ్యామల, పీఓఎల్ నాయకులు కిరణ్ సాయి, ఐఎఫ్టీయూ నాయకులు స్రవంతి అరుణ్ పాల్గొన్నారు.
ఓయూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో..
జూబ్లిహిల్స్‌లో మైనర్‌పై లౌంగిక దాడికి పాల్పడ్డ దుండగులను శిక్షించాలనీ, మైనర్లను అనుమతించిన పబ్బులను రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజా స్వామ్య విద్యార్థి సంఘం ఓయూ కార్యదర్శి కె.స్వాతి డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ ఓయూ కమిటీ అధ్వర్యంలో ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థినులు నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో జ్యోక్యం చేసుకుని బాధితులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న పబ్బులు, క్లబ్బుల సంస్కృతిని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఓయూ నాయకులు శ్వేత, మేనక, సౌజన్య, శాంతి, నవ్య శ్రీ, సుచరిత పాల్గొన్నారు.