Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ సబ్ డివిజన్లో నూతన ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన గంగారాంను సీపీఐ(ఎం) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కులమతాలు, రాజకీ యాలకతీతంగా ఫిర్యాదు దారులకు సమన్యాయం చేకూరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్, బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, నాయకులు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.