Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మహిళల అభ్యున్నతి పాటుపడుతూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడమే తమ స్వచ్ఛంద సంస్థ లక్ష్యం అని స్టార్ ఫౌండేషన్ సంస్థ కార్యదర్శి తన్మయి ఆనంద్ రెడ్డి అన్నారు. ఆదివారం డైమండ్ పాయింట్ చౌరస్తాలో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన అందులో మహిళలకు కుట్టు శిక్షణ. బ్యూటీషన్ కోర్స్, కంప్యూటర్ శిక్షణ, మెహందీ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ రెడ్డి మాట్లాడు తూ నిరుపేద చిన్నారులు, విద్యార్థుల కోసం ఏరోబిక్స్, కరాటే, యోగా శిక్షణా తరగతులు ప్రారంభించినట్టు, శిబిరాలను ఏర్పాటు చేశామన్నామని తెలిపారు. మహిళా అభ్యున్నతి కోసం పేద విద్యార్థులకు అండగా ఉండేందుకుగాను స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్టు వివరించాను. పుట్టిన, పెండ్లి రోజులకు, పార్టీలకు డబ్బులు వృథాగా ఖర్చు చేయకూడదనీ, ఆ డబ్బును ఏదైనా మంచి పనికి ఉపయోగించాలనే సంకల్పంతో కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద విద్యార్థులను ఆదుకున్నట్టు తెలిపారు. అదే సంకల్పతో స్నేహితులతో కలిసి స్టార్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎస్కేరెడ్డి, లతారెడ్డి, పవన్, సతీష్ పాల్గొన్నారు.