Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమం పరివర్తన్లో భాగంగా ఆదివారం వాయు కాలుష్యాన్ని తగ్గించడం ప్రా ముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇంజెన్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడళ్లలో వాహనదారులు సిగల్ కోసం వేచి ఉన్న సమయంలో వాహనదారులు తమ వాహనాలను నిలిపి ఉంచిన సమయంలో వారి ఇంజిన్ల ను స్విచ్ ఆఫ్ చేయమని ఒక చిన్న వీధి నాటకం ద్వారా వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 40 నగరా ల్లోని 126 బిజీ సిగల్ కూడళ్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ వీధి నాటకం ప్రదర్శనకు పూనుకున్నది. ముంబై, గురుగావ్, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే వంటి పెద్ద మెట్రో నగరాలతోపాటు లూథియానా, వార ణాసి, నాసిక్, విజయవాడ, వైజాగ్, రాజ్కోట్, గౌహతి వంటి చిన్న నగరాలలో కూడా ఈ ప్రచారంను నిర్వహి స్తారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఖైరతా బాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వీధి నాటకాలు నిర్వహిస్తారు. రెడ్ సిగల్ చూసి చౌరస్తాలో వాహనాలు ఆగిన వెంటనే, నల్లటి 'టీ' షర్టులు ధరించి, చేతులకు, ముఖానికి నల్లగా పెయింట్ వేసుకున్న నటీనటులు రంగ ప్రవేశం చేసి, తమ స్థానాలు తీసుకుని వీధి నాటకాన్ని ప్రారంభిస్తారు.