Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్‌లోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జాకట శ్రీనివాస్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్ఎస్పీ పార్టీ జెండా సామాన్య ప్రజల ఐక్యతకు చిహ్నం అన్నారు. సామాన్య ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం అనీ, ఈ జెండా ద్వారా రాష్ట్ర ప్రజలకు పార్టీని పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. సామాన్య ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రథమ కర్తవ్యం అన్నారు. సామాన్యుని సంక్షేమం, రాజ్యాధికారం, ఆత్మగౌరవమై పని చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, పల్లెకు పార్టీ జెండాని తీసుకెళ్లి సామాన్య ప్రజలకు భరోసా ఇస్తామన్నారు. తమ సైన్యమే సామాన్య ప్రజలు అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం పని చేసే ప్రతి నాయకున్నీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామనీ, వారికి ఖచ్చితంగా మంచి గుర్తింపును ఇస్తామనీ, రాజకీయంగా ఎదగడానికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో సామాన్యుల రాజ్యం నిర్మించడమే తమ గమ్యం అన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మీర్ఆలీ, రాష్ట్ర కో-ఆర్డినేటర్ జాకట శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు జే.ప్రేమ్ దాస్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు బాబు రాజ్, గజ్వేల్ నియో జకవర్గ ప్రచార కార్యదర్శి అనగాల రాములు, మేడ్చల్ మున్సిపాలిటీ 2వ వార్డు మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎస్కె సుల్తాన్, 3వ వార్డు అధ్యక్షులు నీరుడి ప్రేమ్ దాస్, సీనియర్ నాయకులు మాజీ వార్డు సభ్యులు జాకట రాము లు, నరసింహ, జాకట అశోక్, మల్లెల వెంకటేష్, చంద్ర శేఖర్‌గౌడ్, నీరుడి పద్మారావు, సుధాకర్, శివరాజ్, నీరుడి నర్సింగ్‌రావు, సురేష్, మల్లెల గణేష్, సీిహెచ్ కృష్ణ, ఈశ్వర్, కృష్ణగౌడ్, రమేష్, గోవర్ధన్, శివ కుమార్, మహేష్, ముక్కె ర కుమార్, ఇమ్మానియేల్, అనిల్ కుమార్, అజ్జు, యాద గిరి, ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కొండల్ రావు పాల్గొన్నారు.