Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే నీరా కేఫ్‌లు ప్రారంభం
- రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
బహుజన మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కాటమయ్య గౌడ సంఘం జగద్గిరిగుట్ట వారి ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షురాలు బింగి ఇందిరా గౌడ్, ప్రధాన కార్యదర్శి, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లగోపుల బాబు గౌడ్, కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీని వాస్‌గౌడ్ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఆవిష్కరిం చారు. ముందుగా గౌడ సంఘం జెండా ఆవిష్కరించడంతోపాటు కల్లుగీత కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాపన్నను గౌడ కులస్తుడిగా మాత్రమే చూడవద్దనీ, ఆ కాలంలోనే అన్ని కులాలకు ప్రతినిదిగా మొగల్ రాజులతో పోరాడాడని గుర్తు చేశారు. 366 ఏండ్ల క్రితం జన్మించిన పాపన్న ఒక సాధారణ కల్లుగీత కార్మికుడిగా ఉండి బడుగు, బలహీన వర్గాల కష్టాలను చూసి చలించి ఆనాటి మొగల్ సామ్రాజ్యంలోని తాబేదార్లు, దొర లు, రాజులతో పోరాడిన యోధుడన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరాఠా యోధుడు శివాజీకి సమకాలీకుడైన పాపన్న చరిత్ర లో కనుమరుగయ్యాడనీ, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ఆయన గొప్పతనం ఇప్పుడిపుడే అందరికీ తెలుస్తోందన్నారు. నాడు 33 కోటలను జయించి, గెలిచిన ప్రతీ కోటలోని ధనాగారాల్లోని ధనాన్ని ప్రజలకు పంచేవాడనీ, ఎన్నో చెరువులు తవ్వించాడనీ, వ్యవసాయం అభివృధ్ధికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు. పాపన్న ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అన్ని కులవృ త్తులకు పెద్ద పీట వేస్తున్నారనీ, ఆయా వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను చేపట్టారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వృత్తులవారు తలెత్తుకుని జీవించేలా వారి కండ్లల్లో ఆనందం చూస్తున్నా మన్నారు. గీత కార్మికులకు అత్యధిక ఆదాయమిచ్చే నీరా కేఫ్‌లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, రాష్ట్ర గౌడ నాయకులు కునా వెంకటేష్ గౌడ్, బాల్ రాజు గౌడ్, గౌడ ఐక్య వేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్, గౌడ సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, విగ్రహ దాత భిక్షపతి గౌడ్, గౌడ సాధన సమితి నాయ కుడు శివ కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సింహా గౌడ్, సత్యనారాయణ గౌడ్, శోభన్ గౌడ్, ముకేష్ గౌడ్, నిరంత్ గౌడ్, వెంకన్న గౌడ్, విజరు కుమార్ గౌడ్, దూడల పాపుయ్య గౌడ్, టీఆర్ఎస్ యూత్ నాయకుడు కొలుకుల జైహింద్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, మాజీ కౌన్సిలర్ కృష్ణాగౌడ్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, ఎత్తరి మారయ్య, హజ్రత్ అలీ, సుధాకర్ గౌడ్, మనోజ్ పాల్గొన్నారు.