Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
దళితబంధు లబ్దిదారులకు కార్లు, ఆటోలు, ట్రాలీ ఆటోలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్తో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం అందజే శారు. మారెడ్పల్లి, శనరు నర్సింగ్ హౌమ్ క్రీడా మైదా నంలో అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 మంది లబ్దిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్దిదారులు ఈ వాహనాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. నియోజకవర్గంలో మొదటి విడత దళిత ద్వారా 100 మంది లబ్దిదారులను ఎంపిక చేశామ నీ, అందులో 14 మందికి మంజూరైన వాహనాలను అందజేసినట్టు తెలిపారు. అంతకుముందు ముందు జిల్లా కలెక్టర్ శర్మ మాట్లాడుతూ మొదటి విడత లబ్దిదారులకు రెండో విడతలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎవరూ బాధపడకూడదనీ, చింతించకూడదనీ, అర్హులం దరికీ ఈ పథకం ద్వారా లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, ప్యారసాని శ్యామ్ కుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.