Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
పార్లమెంటులో బీసీవాణిని వినిపిస్తామని కొత్తగా రాజ్యసభకు ఎంపికైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్యకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, బానిసత్వం తొలగిపోవడం కోసమే తాను జీవితకాలం పోరాటం చేశానని, అధికారం కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని స్పష్టం చేశారు. బీసీ ఉద్యమాల ఫలితంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరూ ఉచిత విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీసీలకు, విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. బీసీలకు 1200 గురుకుల పాఠశాలలు, 6 వేల హాస్టళ్లు మరెన్నో వసతులతో 12 లక్షల మంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసించి ఉన్నతస్థానానికి ఎదిగారని తెలిపారు. పార్లమెంటులో బీసీల వాటాను సాధించి తీరుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, తెలంగాణా బీసీ ఫ్రంట్ చైర్మెన్ గొరిగ మల్లేష్, తెలంగాణజ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కోలా జనార్దన్, శ్రీశైలం సత్రం చైర్మెన్ కోషిక శ్రీనివాస్ రావు, ఆవుల వినోద్ కుమార్, తాండూరు నర్సప్ప, గోపాల్, యాదగిరి, ఐలయ్య, జక్కుల వంశీకష్ణ, వన్నడి రమేష్, వెల్లంపల్లి సురేష్, అమాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.