Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతాలు నిలిపివేశారంటూ ఆవేదన ొమేయర్ హామీతో పనిలోకి
నవతెలంగాణ-బోడుప్పల్
మండుటెండలో నిరంతరం కష్టపడి పనిచేసే తమకు జీతాలు నిలిపివేయడం సరైన విధానం కాదంటూ బోడుప్పల్ కార్పొరేషన్ వాటర్ లైన్మేన్లు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ కొన్నేండ్లుగా నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న తమకు ప్రస్తుత కమిషనర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వాపోయారు. ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మేయర్ సామల బుచ్చిరెడ్డి సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కషి చేస్తానని, సత్వరమే జీతాలు అందేలా అధికారులతో మాట్లాడుతానని హమీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో జానీ, మల్లేష్, అర్జున్, భిక్షపతి, లక్ష్మణ్, కుమార స్వామి, సాయి, బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.