Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన ప్రకతి వనరులను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి మాట్లాడుతూ రసాయన వాడకాలు తగ్గించి సేంద్రీయ పంటలను పండించేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్-29 డిప్యూటీ కమిషనర్ దశరథ, ఏఎంఓహెచ్ డాక్టర్ రవీందర్ గౌడ్, ఏఈ వెంకటేష్, శానిటేషన్ సూపర్వైజర్ ధనా గౌడ్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రావు, ఉపాధ్యక్షులు ఉదయ భాను ప్రసాద్, కార్యదర్శి పి రామ్మోహన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎంఎం హుస్సేన్, కోశాధికారి హరికుమారి, సలహాదారులు చిన్నయ్య, మైథిలి, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, మంత్రి వినోద్, యాదగిరి, ఖాజా పాషా, యాకూబ్ షరీఫ్, బలరాం, శివ శంకర్ పాల్గొన్నారు.