Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎమర్జింగ్ ఏఐ డేటాసైన్స్ స్టార్టప్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా సీఈవో నోబెల్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ సెంటర్, టీ హబ్ ఐఐటీటీ, హైదరాబాద్ వారు హాజరై కంపెనీలో జరుగుతున్నటువంటి పలు అంశాలను విద్యార్థులకు సంక్షిప్తంగా వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎల్.వి. నరసింహ ప్రసాద్, డేటాసైన్స్ హెచ్ఓడి డా. పి గోవర్ధన్ లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్టార్టప్స్ విషయాలపై వత్తిపరమైన తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవగాహన పెంపొందించుకోవచ్చు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కళాశాల నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా డాక్టర్ బి. పోలయ్య డా.ఎం.లక్ష ప్రసాద్ వ్యవహరించారు.