Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
క్రీడల్లో రాణిస్తూ దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. థామస్ వరల్డ్ కప్ బ్యాడ్మింటన్ 2022 పోటీలో తొలిసారిగా భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్‌ను ఆదివారం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మెన్ వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించిన విష్ణువర్ధన్ గౌడ్ అంబర్‌పేటవాసి కావడం అభినందనీయమన్నారు. యువత అతన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విష్ణువర్ధన్‌గౌడ్ మాట్లాడుతూ ఏ క్రీడాకారుడు సాధించని థామస్ కప్పును గెలుపొందడం గర్వంగా ఉందని అన్నారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ మాట్లాడుతూ అంబర్‌పేట ప్లే గ్రౌండ్ నుండి ఇండియా స్థాయి వరకు వెళ్లడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో పంజాల జ్ఞానేశ్వర్‌గౌడ్, పంజాల విష్ణు వర్ధన్ గౌడ్ తల్లిదండ్రులు, వెంకటేష్‌గౌడ్, సుహాసిని, కార్పొరేటర్లు పద్మావతి వెంకటరెడ్డి, దూసరి లావణ్యగౌడ్, మాజీ కార్పొరేటర్ పద్మావతిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్‌రెడ్డి, బీజేపీ నాయకులు బి.వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మణ్ యాదవ్, అంబర్‌పేట ప్లే గ్రౌండ్ కమిటీ సభ్యులు పంజాల ధనుంజరుగౌడ్, సద్గురు, శంకర్‌గౌడ్, అరవింద్‌గౌడ్, యాదగిరిగౌడ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.