Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 96వ కార్యక్రమంగా శ్రీత్యాగరాయ గానసభలో జాన పద, శాస్త్రీయ నత్య ప్రదర్శనలతో సిరిమువ్వల సందడి చేశారు. నత్య గురువులు సునంద, అరుణ,ప్రశాంతి శిష్య బందం జయ, జయ తెలంగాణ అంటూ చేసిన నత్యానికి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నమయ్య, రామదాసు కీర్తనలకు నర్తకీమణులు ఆహ్లాదకరంగా నర్తించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సాంఖ్యక శాస్త్రవేత్త పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత లభించిందని తల్లిదండ్రులు దీనిని దష్టిలో ఉంచుకుని పిల్లలలో కళలు పట్ల ఆసక్తి కలిగించాలని కోరారు. సంస్థ నిర్వాహకులు విక్కీ మాస్టర్ మాట్లాడుతూ తాను స్వయంగా నత్య దర్శకునిగా ఎందరికో శిక్షణ ఇచనన్నారు. తన తల్లి ప్రోత్సాహంతోనే కళలు పట్ల తనకు ఆసక్తి కలిగిందని వివరించారు. అనంతరం రమణాచారి వ్యాఖ్యానంలో కళాకారులకు జ్ఞాపికలు బహుకరించారు.