Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజా సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దుర్గా భవాని నగర్ కాలనీ అధ్యక్షులు ఎల్. రమేష్‌రెడ్డి అన్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 7లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో పర్యటించారు. పారిశుధ్య పనులను, పురోగతిలో ఉన్న పనులను పరిశీలించారు. మట్టికుప్పలను చెత్తను తొలగింపజేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి బ్యానర్లు కట్టారు. డ్రయినేజీ పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ జయసింహా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏ.వెంకట్, నిశికాంత్ రెడ్డి, యాదిరెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు