Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాకు వ్యతింకంగా ఎవరూ వార్తలు రాయలేదు
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-నేరెడ్మెట్
'ఆ ఒక్క పత్రిక, ఆ విలేకరి తప్ప.. నాకు వ్యతిరేకంగా వార్తలు ఎవరూ రాయలేదు. ఇతర పత్రికల వారు కూడా తనకు వ్యతిరేకంగా రాయలేదు' అంటూ మహిళా రిపోర్టర్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అసత్య ఆరో ణలు సైతం చేశారు. ఆదివారం 'అభివృద్ధి సరే.. విద్యార్థుల పరిస్థితేంటి?' అనే శీర్షికతో నవతెలంగాణ దిపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందిం చారు. సోమవా రం మచ్చ బొల్లారం డివిజన్ రీట్రిట్ కాలనీలో నిర్వహిం చిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధికారులు, స్థానిక నాయకులు, అనుచరులు, కాలనీవా సుల ఎదుటే పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఓల్డ్ అల్వాల్ బాలుర సెకండరీ పాఠశాలను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సురేందర్ రెడ్డికి ఎందుకు చెప్పావనీ, అతని పాత్ర ఇందులో ఏముందనీ, రాజకీయాలు చేయొద్దనీ, నువ్వు పాఠశాలకు మాత్రమే హెచ్ఎమ్ అనీ, ఇక్కడ కార్పొరేటర్ ఉండగా నువ్వు సురేందర్‌రెడ్డికి చెప్పి రాజకీయాలు ఎందు కు చేస్తున్నా వంటూ అధికారులు, నాయకులు, రిపోర్టర్లు, స్థానికుల ముందే హెచ్ఎంను గట్టిగా నిలదీశారు. తాను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాననీ, నువ్వెందుకు అడ్డు పడుతున్నావనీ, నీకు ఎవరు ధమ్కీ ఇచ్చారని పేపర్లో రాయించావు అని ఎమ్యె ల్యే స్కూల్ హెచ్ఎం మీద మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ వర్షా కాలంలో వచ్చే వరదలకు ఇండ్లతోపాటు కాలనీలు కూడా మునిగిపో తున్నాయనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రస్తుతం వర్షపు నీరు వెళ్లడానికి మాత్రమే పైపు లైను స్కూల్ ముందు నుంచి స్కూల్ ఆవరణ గుండా పోతుందనీ, దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లోనైనా ఇండ్ల వారు ఈ పైపు లైనుకు డ్రయినేజీ నీరు కలపకుండా చూసు కోవాలని సూచించారు.
స్కూల్ హెచ్ఎం మీద ఒత్తిడి సరికాదు
బ్యాగరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు
స్కూల్ హెచ్ఎం మీద నాయకులు ఒత్తిడి తేవడం పద్ధతి కాదు. ఏదైనా ఉంటే డీఈఓ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకుని పని చేసుకోవచ్చు. నా నియోజకవర్గంలో సుపరి పాలన అందిస్తున్న అని బహిరంగ సభల్లో చెబుతూ బడి సమస్య గురించి రాస్తే సరిచేసుకోవాలి కానీ మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా హేళన చేస్తూ అవమా ణిస్తూ మాట్లాడటం ఏం పరిపాలన. మిగతా పత్రికలు రాయపోవచ్చు. అది వారి వ్యక్తిగతం. సమస్యను వెలుగు లోకి తెచ్చినప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సీనియర్ ఉద్యమకారులు, జేఏసీ సురేందర్ రెడ్డినికి ఆయన ఎవరు అని హెచ్ఎంని దబాయించడం ఉద్యమ కారున్ని బహిరంగంగా అవమానించడమే అవుతుంది. ప్రశ్నించే వారిని భయపెట్టడం మల్కాజిగిరిలో నియంత పాలనను తలపిస్తుంది. ప్రజా సంఘాలు ప్రశ్నించకూడ దా? ఇదేం సుపరిపాలన? దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండి స్తుంది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు పర్మిషన్ తెచ్చుకుని బేషరతుగా పనులు చేసుకోవచ్చు.