Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కరోనా సమయంలో జిల్లావారీగా వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ మెయింటనెన్స్ ఆపరేటర్లు ఉద్యోగులుగా తీసుకొని ఇప్పుడు తీసేయడం అన్యాయమని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు అబ్ జింత్ యాదవ్ అన్నారు. సోమవారం కోఠిలోని వైద్య విధాన పరిషత్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 విజంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పీఎం కేర్ ద్వారా రూపొందించినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ మెయింటనెన్స్ ఆపరేటర్స్ ఉద్యోగుల తీసుకొని ఇప్పుడు తీసేయడం సరికాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతకుముందు ఉన్న ఉపాధిని వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం పర్మినెంట్ చేస్తుందని ఆశతో ఉద్యోగాల్లో చేరారని ఉన్నట్లుండి వాటిని తీసివేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా వారిని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైద్య విధాన పరిషత్ చాంబర్లో వినతి పత్రం అందించారు.