Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం హైదరాబాద్ సిటీ పోలీస్ వారి సహకారంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, మాదక ద్రవ్యాల నిరోధకత, సైబర్ నేరాలను అరికట్టే అంశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య అధ్యక్షత వహించగా, క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ డి.కిషన్, నల్లకుంట ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఎం.రవి హాజర య్యారు. ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.చిన్న బాబు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న వారి వద్దకు దుర్వ్యసనాలు దరి చేరవన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చు కోవాలని సూచించారు. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ డి.కిషన్ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో విద్యార్థులకు వివరించి, సెల్ ఫోన్ వాడకం విషయంలో విద్యార్థులకు తగిన జాగ్రత్తలు సూచించారు. నల్లకుంట ఇన్స్పెక్టర్ ఎం.రవి మాట్లాడుతూ సీసీ కెమెరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులు పి.వెంకట ఈశ్వర్, ఎస్.రవి ప్రసాద్, ఇ.నర్సింగరావు, అధ్యాపకులు డా.జె.భారతి, ఏ.తిరుపతి, డా.ఎల్.శ్రీనివాస రావు, డా.మల్లీశ్వరి, బి.విజయ నిర్మల, డా.సౌజన్య, ఎన్.శ్రీదేవిలతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.