Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కింగ్ కోఠి ప్రభుత్వ ఆయుర్వేద పాలీ క్లినిక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం సుల్తాన్‌బజార్ తిలక్ పార్క్ సమీపంలో గల వజ్ర మైసమ్మ ఆలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ శ్రీనివాసరావు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం పూర్వకాలం నుంచి ప్రజలకు అందుబాటులో ఎన్నో వ్యాధులను బాగు చేసిన చరిత్ర ఆయుర్వేద వైద్యానిదనొ చెప్పారు. ప్రతి వ్యాధికి మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా సమయంలో దేశం మొత్తం ఆయుర్వేదం వైపే దష్టి సారించిందని చెప్పారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వైద్యం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఫార్మసిస్టు సంధ్య, తదితరులు పాల్గొన్నారు.