Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఉత్తమ సాహితీవేత్తలు సమాజంలో శాశ్వతంగా నిలిచి ఉంటారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై కిన్నెర ఆర్ట్స్, వాసా ఫౌండేషన్ నిర్వహణలో ప్రఖ్యాత రచయిత్రి వాసా ప్రభావతి జయంతి సందర్భంగా మరో ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతికి ప్రభావతి జీవిత సాఫల్య గురు పురస్కారంగా 25 వేల నగదును, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాథ శర్మకు ప్రభావతి జీవిత సాఫల్యంగా 25 వేల నగదుతో డాక్టర్ రమణ సంస్థ పక్షన బహుకరించి మాట్లాడారు. ప్రభావతి బహుముఖ సాహితీ ప్రక్రియల్లో ప్రతిభావంతురాలన్నారు. రచనల్లోనే కాక వ్యక్తిత్వంలోను సూటితనం, స్త్రీలపై సామాజిక వివక్షతను ధైర్యంగా నిగ్గతీయటం ఆమెకు గుర్తింపు అన్నారు. తల్లిదండ్రుల పేరిట పురస్కారాలను ఏర్పరచి వారిని శాశ్వతంగా నిలపటం వారిపిల్లలు ఇతరులకు మార్గదర్శకు లన్నారు. పురస్కార గ్రహీతలు రఘునాథ శర్మ, భారతి లు ఆదర్శ గురువులని కొనియాడారు. సాహితీవేత్త వోలెటి పర్వ్యతీశం అధ్యక్షత వహించిన సభలో ఆకాశవాణి విశ్రాంత అధికారి శైలజ సుమన్, గుడిపాటి, పొత్తూరి సుబ్బారావు శైలజ మిత్ర, ప్రభావతి కుమార్తె, కుమారుడు మీనాక్షి, ప్రకాష్ పాల్గొన్నారు. రఘురామ్ స్వాగతం పలికిన సభలో ప్రభావతి లలిత గీతాలు చంద్ర తేజ, మూర్తి, శశికళ తదితరులు మధురంగా గానం చేశారు.