Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో డ్రయినేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం కవాడిగూడ డివిజన్ కుమ్మరి బస్తీ వద్ద రూ.7 లక్షలతో నిర్మించనున్న సీవరేజీ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రచనశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరించి శిథిలావస్థలో ఉన్న వాటి స్థానాల్లో నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అభివద్ధి పనులకు అత్యధిక నిధులు కేటాయించి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహా, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాయికష్ణ, శ్రీనివాస్ యాదవ్, రామ్ చందర్, శ్రీహరి, ఆటో శ్రీనివాస్, విక్కీ, రాజు యాదవ్, రాజశేఖర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, జంగా శ్రీనివాస్, జమాలుద్దీన్, కార్తీక్, సురేష్, ప్రభాకర్, రూప, ప్రకాష్ పాల్గొన్నారు.