Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీ హాస్పిటల్ తొలి వార్షికోత్సవంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
నవతెలంగాణ-బోడుప్పల్
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయివేటు ఆస్పత్రులు కషి చేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని జేపీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి వైద్యుడు సమాజహితం కోసం పాటుపడాలని కోరారు. వైద్యో నారాయణ హరీ అని పెద్దలు అన్నట్టు వైద్యులు ప్రాణాధాతలని అందుకే వారిని ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. జేపీ హాస్పిటల్ ప్రారంభించిన సంవత్సరం కాలంలోనే ప్రజల మన్ననలు పొందిందని అన్నారు. అనంతరం డాక్టర్ కలుకూరి అన్వేష్ మాట్లాడుతూ జేపీ హాస్పిటల్ అధ్వర్యంలో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జేపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ జయపాల్ రెడ్డి, భాను, రాములు తదితరులు పాల్గొన్నారు.