Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజల సౌకర్యం కోసమే రహదారుల విస్తరణ పనులు వేగవంతం జరుగుతున్నాయని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్డు విస్తరణ పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ కోసం స్తంభాల నిర్మాణ పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా బడంగ్పేట్ నుండి నాదర్ గుల్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణం చేపడుతు న్నామని, అదేవిధంగా రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రూ.50లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులను ప్రారంభించటం జరిగిందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అదేశంతో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు సుర్ణగంటి అర్జున్, పెద్దబావి సుదర్శన్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, లిక్కి మమత కష్ణరెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, బంగారు అనిత ప్రభాకర్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, సుక్క శివకుమార్, బండారి మనోహర్, నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, గౌర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.