Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్, ఉప ప్రధాన మంత్రి, వాణిజ్య మంత్రి, బఖిత్ సుల్తానోవ్, తన భారతదేశ పర్యటనలో భాగంగా సుప్రసిద్ధ కజకిస్తాన్ కవి అబరు కునన్బయులీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత విదేశీ వ్యవహారాలు, సాంస్కతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, భారతదేశంలోని దౌత్య మిషన్ల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అబరు కునన్బయులీ గౌరవార్థం కజకిస్థాన్ ఉప ప్రధాని బఖిత్ సుల్తానోవ్కు డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్బంగా రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్, అదానీ గ్రూప్‌ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ చర్చలు సంప్రదాయేతర ఇంధనం, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. విద్య, సమాచార సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యంపై, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంపై కూడా ప్రతినిధి బృందం కృషి చేస్తున్నది.