Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దళితులు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని చేపడుతోందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. మంగళవారం దళిత బంధు పథకం మొదటి విడత కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంపికైన 22మంది లబ్దిదారులకు యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కు ఎదురుగా ఉన్న మైదానంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వాహనాలు అందజేశారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ... దళిత బంధు పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిగతావారికి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.