Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
ఎస్ఎన్డీపీ నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీలో జరుగుతున్న ఎస్ఎన్డీపీి నాలా పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సమీపి స్తున్న తరుణంలో వర్షం నీరు వెళ్లేందుకు నిర్మాణం చేస్తున్న నాలా పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వర్షాలు కురిస్తే ఇండ్లలోకి నీళ్లు రాకుండా ఉండాలంటే నాలా పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. కాలనీవాసులతో నాలా పనుల పురోగతిపై చర్చించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయించటానికి కషి చేస్తానని మంత్రి ప్రజలకు తెలిపారు. అనంతరం బాలాజీ కాలనీలో పర్యటించారు. కాలువల నిర్మాణము, తదితర వాటిపై బస్తీవాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేశ్వర్, డీిఈ గోపీనాథ్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్‌రెడ్డి, నాయకులు దీప్లాల్ చౌహన్, సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.