Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలి : సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
- హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్థన్ మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు ఎకరాల భూమితో పాటు దళితబంధును దళిలందరికీ వర్తింప జేయాలన్నారు. పోడు రైతులతో పాటు కౌలు రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలన్నారు. ఇండ్లులేని పేదలందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనీ, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించడంతో పాటు పెంచిన ఆర్టీసీ, విద్యుత్ చార్జిలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదివాసీ చట్టాలు అన్నింటినీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ప్రతినిధి బృందం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాస్, జి.అనురాధ, శివబాబు, స్వామి, సరళ, తెలంగాణ శ్రీను తదితరులు పాల్గొన్నారు.