Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భాష సాంస్కతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సిరాజ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా జషన్ ఏ తెలంగాణ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేసవి సెలవుల్లో నత్య శిక్షణ తీసుకున్న చిన్నారులు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు చక్కని ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్, యాక్టర్ సూరపానం మూవీ సంపత్ కుమార్, శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియెగ్రాఫర్ రాజు మాస్టర్, విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు అరికపూడి, యాంకర్, నటి కల్యాణి నాయుడు, ఫిల్మ్ యాక్టర్స్ మీసాల లక్ష్మణ్, గిరిపోతరాజు విద్యసాగర్, సింగర్ వివేకానంద, కవిత, లిరిక్ రైటర్, సింగర్, పేరిణి సందీప్, పేరిణి నాట్య గురు ప్రవీణ, అడ్ల సతీష్ కుమార్ విచ్చేశారు. నటరాజ నాట్యలయ, మనిద్వీప ఆర్ట్స్ అకాడమీ ఎం.ఎం డాన్స్ అకాడమీ, నిత్య అభినయ డాన్స్ అకాడమీ, నాదం మ్యూజిక్ అకాడమీ, గౌతమ్ డాన్స్ అకాడమీ చిన్నారుల సంగీతం, నత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.పేరిణి, బంజార, కూచిపూడి, జానపదం, దేశభక్తి నత్యాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిరాజ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు ఎస్.కె సిరాజ్ మాట్లాడుతూ భాష సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ ప్రోత్సాహంతో ఎంతో మంది మారుమూల గ్రామాల కళాకారులను వెలికితీయడం జరుగుతుందన్నారు. పేరిని నాట్యాన్ని దేశ నలుమూలలు వ్యాప్తి చేస్తున్న పేరిని సందీప్, శ్రీ మనిద్వీప ఆర్ట్స్ అకాడమీ శిష్య బందానికి, సూరపానం మూవీ టీం, యాంకర్ కల్యాణి, రాజు మాస్టర్ లకు సిరాజ్ మాస్టర్ చేతుల మీదుగా సన్మానం చేశారు.