Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు జంటలను సన్మానించిన మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ వారి కార్యాలయంలో 'కులనిర్మూలన సంఘం' వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రేమ వివాహపు ఐదు జంటలను పిలిపించి, సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వహీద్, వారి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆ జంటలకు శాలువాలు కప్పి మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ తానూ జ్యోతి అనే హిందూ అమ్మాయితో మతాంతర వివాహం చేసుకున్నట్టు తెలిపారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారనీ, వారు కుడా వారికి నచ్చిన వారినే పెళ్లి చేసుకున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఆటంకాలు రాలేదని తెలిపారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారికి అండగా ఉండేందుకు 'కులనిర్మూలన సంఘం' ఏర్పాటు చేసి ఇప్పటికి 50 ప్రేమ వివాహాలు జరిపి వారికి అండగా నిలిచామని తెలిపారు. ఇటీవల జరుగుతున్న పరువు హత్యల వల్ల జంటలకు ఇంకా మెరుగైన రక్షణ కావాలనీ, ప్రత్యేక చట్టం తేవాలని కోరుతూ వారి సంఘం తరఫున ఒక మెమొరాండం కమిషన్ వారికి అందజేశారు. ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రికలో గత నెల 15వ తేదీన 'ఆ జంటకు అండగా ఉంటాం' అనే శీర్షికతో తమ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలిపారు. తర్వాత జస్టిస్ చంద్ర య్య ఒక్కొక్క జంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కనుకున్నారు. ఏ ఇబ్బంది ఎదురైనా తాము ఎల్లపుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం వచ్చిన జంటలకు శాలువాలతో సన్మానించారు. ఆ సమయానికి కమిషన్కు వచ్చిన లతా ఎబుషి పోచంపతెల్ ట్రస్ట్ (స్వచంద సంస్థ) అధినేత బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, వారి భర్త ఈ సామవేశంలో పాల్గొన్నారు. లతి, శ్రీ దేవిలది కుడా కులాంతర వివాహమని తెలిపారు. వివాహం తర్వాత వీలైతే తమ తల్లి తండ్రులకు నచ్చచెప్పి వారితో కలిసి మెలిసి ఉండాలని కోరారు. అనంతరం జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ మానవునికి తనకి నచ్చిన వారితో పెళ్లి చేసుకునే హక్కు కుడా మానవ హక్కే అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏ మతాన్నైనా పాటించే హక్కు ఉందన్నారు. మతం, కులం అనే విబేధం లేకుండా వారి వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందదన్నారు. అలాంటి హక్కును అడ్డగించే చేర్య ఎవరు చేసినా వారు శిక్షార్హులు అని తెలిపారు. దేశంలో ఉన్న వివిధ వివాహ చట్టాల గురించి, ప్రేమ వివహాలు చేసుకునే వారికి ఏ ఏ చట్టాలు వర్తిస్తాయో, మానవ హక్కుల కమిషన్ నుంచి వారికి దొరికే చట్టపరమైన రక్షణ, మొదలగు అంశాల గురించి వారికి వివరించారు. ఇలాంటి పరువు హత్యలు జరుగకుండా చూసేందుకు ప్రజల్లో చట్టాల పై అవగాహన పెరగాలని తెలిపారు.