Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాల్టీలో ఉన్న పెద్ద చెరువు కట్ట కింది భాగంలో ఉన్న ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొంతమంది సర్వే నెంబర్ 222లో చెరువు కట్ట కింది భాగంలో ఉన్న నాలాను మట్టితో నింపి అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసి రూ.లక్షలకు అమ్ముకోవటం ఏంటని శనివారం జల్పల్లి మున్సిపాల్టీ పట్టణ ప్రగతి కార్యక్ర మంలో భాగంగా విషయం తెలిసిన మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ మేరకు మంత్రి రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ప్రభుత్వ భూములను అక్రమంగా కొందరు కబ్జా చేస్తున్నా అధికారులు నిద్రపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో వెంటనే బాలాపూర్ మండల రెవెన్యూశాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారులు మంగళవారం ప్రభుత్వ భూమిని పరిశీలించి అక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలాపూర్ మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకుంటే ఉపేక్షించేది లేదనీ, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.