Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సాహితీ వ్యాసకర్తగా, విమర్శకునిగా, పరిశోధకునిగా తెలుగు సాహిత్యంలో సమగ్ర అధ్యయనం చేసిన ఎస్వీ రామారావు చిరయశస్సు సముపార్జించుకున్నారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ ప్రశంసించారు. మాసాబ్ ట్యాంక్ వద్దనున్న డాక్టర్ రమణ నివాస కార్యాలయంలో గురువారం ప్రముఖ సాంస్కతిక సంస్థ ఆకతి నిర్వహణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య ఎస్వీ రామారావు రచించిన అక్షర గవాక్షం ఆయన 80 ఏండ్ల వాగ్మయ చరిత్ర గ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది. ఎనభై ఏండ్ల వయస్సులోనూ అవిశ్రాంతంగా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రామా రావు సాహిత్య వీక్షణ పరిశోధకులకు గవాక్షంవంటిదని అభివర్ణించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళభరణం కష్ణ మోహన రావు మాట్లాడుతూ రామారావు మూర్తి రచనలు విశ్లేషణతో కూడి ఉంటాయని వివరించారు. సాహితీవేత్త చౌదరి నరసింహారావు గ్రంథ సమీక్ష చేశారు. ఆకతి సుధాకర్ అధ్యక్షత వహించిన సభలో ఫిక్కీ సీఎండీ జగదీష్ చంద్ర, శ్వేత తదితరులు పాల్గొన్నారు.