Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ శంకర్‌నగర్, ఖాదర్‌బాగ్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొని సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సీసీ రోడ్లు, లోప్రెషర్ నీటి, శానిటేషన్, విద్యుత్ స్తంభాలు సమస్యలను గుర్తించామని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ గోపాల్, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, జల మండలి మేనేజర్ రోహిత్, అశ్వక్, విద్యుత్ ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు.
మౌలానా ఆజాద్‌నగర్‌లో ఎమ్మెల్యే పర్యటన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఉమా రమేష్‌యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ శిరీషయాదవ్తో కలిసి మౌలానా ఆజాద్‌నగర్‌లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని అన్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామన్నారు. బస్తీ దవాఖానాలో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, డ్రయినేజీ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.