Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర జలశక్తి అభియాన్ జాయింట్ సెక్రెటరీ వేదవీర్
- మేడ్చల్ జిల్లాలో క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పర్యటన
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
భూగర్భజలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలను నిర్మించి వాననీటిని ఒడిసిపట్టాలని, దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ జాయింట్ సెక్రెటరీ వేదవీర్ ఆర్యా అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవీర్ ఆర్యా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈనెల 11వ తేదీ వరకు కేంద్ర బందం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి భూగర్భజలాల పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తారని తెలిపారు. రెండు రోజుల పర్యటన అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తామన్నారు. నీటి వనరుల పెంపుదలకు చేపట్టే చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రతి నీటి బొట్టు ఎంతో అమూల్యమైందని, వర్షపు నీటిని కాపాడుకుంటూ మున్ముందు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వాటర్ నిల్వలు పెంచాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిని సమద్ధిగా కాపాడాలని దీనికి అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ విషయంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హరితహారంపై ప్రత్యేక దష్టి పెట్టి ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర జలశక్తి అధికారికి వివరించారు. ప్రతి ఇంటికీ ఐదు చొప్పున మొక్కలు నాటే ప్రక్రియ, అవెన్యూ, మల్టీ, బ్లాక్ ప్లాంటేషన్లను చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి గ్రామంలో పల్లె ప్రకతి వనం, సొంత నర్సరీలు ఉన్నాయని వివరించారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆరు శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. అనంతరం రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ భూగర్భజలాలు పెంపొందించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. అలాగే 2021-22లో జరిగిన పనులపై నివేదిక ఇవ్వడంతో పాటు 2022-23కు సంబంధించి యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో జలశక్తి అభియాన్ టెక్నికల్ అసిస్టెంట్ ధీరజ్ భట్నాగర్, , జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.