Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో వత్తి కొనసాగిస్తున్న యువ న్యాయవాదులకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద గురువారం తెలంగాణ జూనియర్ అడ్వొకేట్స్ అసోసియేషన్ భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీకష్ణ అధ్యక్షత వహించగా, ఆర్. కష్ణయ్య హాజరై మాట్లాడుతూ తాను న్యాయవాద వత్తి కొనసాగిస్తున్న తొలినాళ్లలో యువ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు నిర్వహించి స్టైఫండ్, లా పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వ సహాయం వంటివి సాధించామని తెలిపారు. పాత పద్ధతిలో కాకుండా యువ న్యాయవాదులకు స్టైఫండ్ 10వేలు, కొత్త హెల్త్ కార్డ్ అప్లికేషన్ విడుదల చేయాలని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ రెండు లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, ఆఫీస్ ఫర్నిచర్, లా బుక్స్ కోసం 1.60 లక్షలు అందజేయాలని కోరారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి తీసుకురావాలని అలాగే కోర్టుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయడానికి కొత్త న్యాయవాదులకు అవకాశం కల్పించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంశీకష్ణ మాట్లాడుతూ న్యాయవాదులకు తక్షణమే కొత్త హెల్త్ కార్డ్ అప్లికేషన్ విడుదల చేయాలని కోరారు. 41 ఏ సీఆర్ పీసీ స్టేషన్ బెయిల్ వల్ల సామాన్య ప్రజలకి న్యాయం జరగడం లేదని, కొంతమంది పోలీసు ఇన్స్పెక్టర్లు దీని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ 41 ఏ సీఆర్ పీసీని సవరణ చేయాలని కోరుతూ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణకు రిప్రజెంటేషన్ ఇచ్చామని, దీనిపై సీజేఐ స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కమిటీ రిపోర్ట్ తీసుకొని వెంటనే అమలు చేయాలని అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు సమీపంలో అడ్వకేట్స్ కాలనీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, రాష్ట్ర నాయకులు వేముల రామకృష్ణ, ఉదరు, అసోసియేషన్ నేతలు నరేష్, కుమార్ మహేంద్ర, గిరీష్, సాయి, ప్రతాప్, పరమేశ్, విజరు, భార్గవ్ చారి, ప్రకాష్, అరవింద్ పాల్గొన్నారు.