Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
పాతబస్తీ రవీంద్ర నాయక్ నగర్ కాలనీలో కొత్త నాలాను నిర్మించొద్దు అని సీపీఐ(ఎం) జంగంమేట్ డివిజన్ కార్యదర్శి కష్ణ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఏఈ చిట్టి బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఉన్న నాలాలను పునరుద్ధరించకుండా, అవి సరిగ్గా లేవంటూ కొత్త నాలాను నిర్మించడం సరికాదన్నారు. గతంలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నాలాల పరిస్థితి ఈ విధంగా ఏర్పడిందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నాలా పనులు వెంటనే ఆపివేయాలని కోరారు. పాత నాలాల పనులను సరిగా చేయకుండా కొత్త నాలాలను నిర్మించడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా అధికారులు ఆలోచన ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రామ్‌కుమార్, బలరాం, రాజేష్, వినోద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.