Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నట్టల నివారణా మందుల పంపిణీ : మేయర్
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తిని పెంచటానికే నట్టల నివారణా మందులను పంపిణీ చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం బాలాపూర్ గ్రామంలో స్టానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డితో కలసి నట్టల నివారణా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతుంద న్నాఉ. గొర్రెల, మేకల పెంపకందారులు ప్రభుత్వం ఉచి తంగా అందిస్తున్న నట్టల నివారణా మందులను సద్విని యోగం చేసుకోవాలన్నారు. గొర్రెల, మేకలకు నట్టల నివార ణా మందులను తాగించడం వల్ల అంతర, బాహియా పరాన్న జీవుల నిర్ములన జరిగి రోగనిరోధక శక్తి పెరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు మనోహర్, కో -ఆప్షన్ సభ్యులు రఘునందనాచారి, పశువైద్య అధికారి అజరు వీర్ రెడ్డి, పీఏసీఎస్ సభ్యులు రావుల లింగం, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు ఈ.సత్యనారాయణ, సభ్యులు కుమారయ్య, ఉప్పు కిష్టయ్య, బలవంత్, గొర్రెల పెంపకం దారులు బాలప్ప, భిక్షపతి, ఐలయ్య, విఏఎస్ డా.రతన్, విల్ ఓ వెటర్నరీ అసిస్టెంట్ ఎండీ షఫీ తదితరులు పాల్గొన్నారు.