Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక చెరువుల పరిరక్షణ సమితి అని సమితి సభ్యులు అరవింద్ శర్మ అన్నారు. శుక్రవారం చెరువుల పరిరక్షణ సమితి నాలుగో ఆవిర్భావ దినోత్సవం బాలాపూర్ చౌరస్తా మంత్రాల చెరువు ప్రాంతంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ సమితి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అన్నారు. చెరువుల పరిరక్షణ సమితి పోరాటం కారణంగా చెరువుల అభివృద్ధి కోసం మంజూరైన రూ.23 కోట్లను దుర్వినియోగం చేశారన్నారు. ట్రంక్ లైన్ నిర్మించినా చెరువుల్లో మాత్రం మురుగునీరు అలాగే ఉందన్నారు. సంద చెరువును కుంచించారనీ, మంత్రాల చెరువులోకి అనేక ప్రాంతాల నుంచి మురుగునీరు వదులుతు తన్నారన్నారు. పెద్ద చెరువు అభివృద్ధి ఆగిపోయిందన్నారు. పార్కుల ఊసే లేదన్నారు. సత్యసాయి నగర్లో వరదనీటి కోసం రూ.20 లక్షలతో నిర్మించిన కాలువ నిర్మాణం అధ్వా న్నంగా మారిందన్నారు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమ స్యల్ని బయిట పెట్టడంతోపాటు వాటి పరిష్కారం కోసం చెరువుల పరిరక్షణ సమితి పోరాటంలో ముందుంటుంద న్నారు. తరచూ సమావేశాల్ని ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమం పరిరక్షణ సమితి చేపడుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ శర్మ, చంద్రశేఖర్, అశోక్ చక్రవర్తి, సుదర్శన్, గోపాల్, రాజలింగం, మురళీ కృష్ణమాచారి, శేఖర్, మహేందర్, తిరుపతి రెడ్డి, కృష్ణ, కిరణ్ తో పాటు వందమంది సమితి సభ్యులు పాల్గొన్నారు.